Mirchi Masala Curry By , 2017-10-30 Mirchi Masala Curry Here is the process for Mirchi Masala Curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: పెద్దగా ఉన్న పచ్చిమిరపకాయలు – 15,ఉల్లిపాయ – 1,టమాటా – 1,వేరుశనగ గుళ్ళు – 2 టేబుల్ స్పూన్,ధనియాలు – 1 టీ స్పూన్,నల్ల నువ్వులు – 1 టెబుల్ స్పూన్,ఎండు కొబ్బరి – కొంచెం,అల్లం – చిన్న ముక్క,వెల్లుల్లి పాయలు – 4-5,కారం -తగినంత,పసుపు – కొద్దిగా,గరంమసాలా పొడి – కొద్దిగా,ఉప్పు – తగినంత,నూనె – 2 టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 ముందుగా మిరపకాయలు కడిగి శుభ్రం చేసుకుని మధ్యలో చీరుకుని ఉంచుకోవాలి (బజ్జీ మిపకాయలు.. ఎందుకంటే కారం తక్కువగా ఉంటుంది).  Step 2 ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని  మరిగాక మిరపకాయలు వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి.  Step 3 ఇలా చేయడం వల్ల మిరపకాయల్లో కారం తగ్గుతుంది.  Step 4 మరో పాత్రని తీసుకొని దానిలో వేరుశెనగ గుళ్లు వేయించుకోవాలి.. అవి వేగాక ధనియాలు నువ్వులు, ఎండుకొబ్బరి కూడా వేసి దోరగా వేయించుకోవాలి.    Step 5 ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తరువాత పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఈ పొడిలోనే ఉల్లిపాయ ముక్కలు,టమాటా క్కలు,అల్లం,వెల్లుల్లి,పసుపు వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా నూరుకోవాలి.    Step 6 ఇలా తయారు చేసుకున్న స్టఫ్ ను ఉడికించుకున్న మిరపకాయల్లో కూర్చి పెట్టుకోవాలి.   Step 7 మరో పాత్రలో నూనె తీసుకొని అది మరిగిన తరువాత మిరపకాయలు వేసి వేయించుకోవాలి.    Step 8 మిగిలిన మసాలా ముద్దలో కొంచెం నీరు పోసి వేయించుకొని పక్కన పెట్టుకున్న మిరపకాయల్ని వేసి మిరపకాయలు బాగా ఉడికి మిశ్రమం దగ్గర పడిన తరువాత స్టవ్ ఆపేస్తే సరి. మిరపకాయ మసాలా కూర రెడీ అయినట్టే.          
Yummy Food Recipes
Add