Bitter Gourd Fry With Onions Recipe By , 2017-10-27  Bitter Gourd Fry With Onions Recipe Here is the process for Bitter Gourd Fry With Onions Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: కాకరకాయలు - పావు కిలో,మజ్జిగ - ఒక గ్లాసు,ఉల్లిపాయలు - పావు కిలో,పచ్చిమిర్చి - 10,నూనె - 150 గ్రాములు,పసుపు - చిటికెడు,ఉప్పు - తగినంత., Instructions: Step 1 ఒక గిన్నెలో సగం వరకు నీళ్ళు పోసి, ఉప్పు, పసుపు, మజ్జిగ వేసి వుంచండి.  Step 2 పుల్లటి మజ్జిగ అయితే మరీ మంచిది. కాకరకాయల్ని కడిగి, పైన వున్న చిన్న చిన్న ముచ్చికల లాంటివి గీరేసేయాలి.  Step 3 అలా గీరేసిన తర్వాత కొసల దాకా వెళ్ళకుండా కాకరకాయ మధ్యలో గాటు పెట్టండి.   Step 4 ఆ తర్వాత వాటిని మజ్జిగ, నీరు, ఉప్పు, పసుపు వేసి కలుపుకున్న గిన్నెలో వేసి ఉడకబెట్టండి.  Step 5 కాయ మరీ మెత్తగా అవకుండా ఉడకబెట్టిన తర్వాత నీటిని వంచేయండి.  Step 6 ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పును కచ్చాపచ్చాగా దంచుకోండి.  Step 7 బాణలీలో నూనె వేసి కాగాక ముందుగా కాకరకాయల్ని నూనెలో ఎర్రగా వేయించుకోవాలి.  Step 8 వాటిని తీసి పక్కన పెట్టుకుని, ఉల్లి, పచ్చిమిర్చి, కారాన్ని అదే నూనెలో వేసి ఎర్రగా వేయించి తీసుకోండి. Step 9 ఈ కారాన్ని కాకరకాయల్లో పెట్టి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుని, కాకరకాయని కొరుక్కుంటూ తినొచ్చు.  
Yummy Food Recipes
Add