Sabudana carrot kheer recipe By , 2017-03-27 Sabudana carrot kheer recipe Here is the process for Sabudana carrot kheer making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: సగ్గుబియ్యం (సాబూదాన్) - అరకప్పు,,పాలు - ఏడు కప్పులు,,పంచదార - 2 కప్పులు,,క్యారట్ తురుము - కప్పు,,బాదంపప్పులు - పావు కప్పు (దోరగా వేయించి పొడి చేయాలి),,ఏలకుల పొడి - టీస్పూను,,కుంకుమపువ్వు - చిటికెడు,,నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు,,జీడిపప్పు, కిస్‌మిస్ - గార్నిషింగ్‌కి సరిపడా, Instructions: Step 1 సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి కప్పు నీటిలో సుమారు అరగంటసేపు నాననివ్వాలి. పాలను మరిగించాలి Step 2 సగ్గుబియ్యంలో తగినంత నీరు పోసి ఉడికించి ఎక్కువగా ఉన్న నీటిని ఒంపేయాలి Step 3 బాణలిలో నెయ్యి వేసి కరిగాక, క్యారట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి తీసేయాలి. Step 4 అదే బాణలిలో మరి కాస్త నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌లు వేయించి తీసేయాలి Step 5 ఒక చిన్న పాత్రలో టీ స్పూను పాలు, కుంకుమపువ్వు వేసి కలపాలి Step 6 మరుగుతున్న పాలలో ఉడికించిన సగ్గుబియ్యం, వేయించి ఉంచుకున్న క్యారట్ తురుము, ఏలకులపొడి, కుంకుమపువ్వు పాలు వేసి బాగా కలిపి ఐదు నిముషాలు ఉంచాలి Step 7 వేయించి ఉంచుకున్న జీడిపప్పులు, కిస్‌మిస్‌లు వేసి కలిపి దించేయాలి.
Yummy Food Recipes
Add