Guthivankaya Koora By , 2017-02-23 Guthivankaya Koora Here is the process for Guthivankaya Koora making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: వంకాయలు - 5,ఉల్లిపాయలు - 1 పెద్దది సన్నగా తరిగినది,టమోటాలు - 2 సన్నగా తరిగినది,చింతపండు - 2 నిమ్మకాయంత,వేరుశెనగపప్పు - 15 - 20,తరిగిన పచ్చి కొబ్బరి - 1 /2 cup,వెల్లుల్లి - 4 - 5,అల్లం వెల్లుల్లి పేస్టు - 1 teaspoon,పసుపు - 1 teaspoon,కారం,ఉప్పు,ఆవాలు,మెంతులు,జీలకర్ర,ఎండు మిర్చి - 4,నూనె, Instructions: Step 1 వంకాయలను నాలుగు భాగాలుగా సగం వరకు కోసుకోవాలి. మొత్తం కోయకూడదు. Step 2 ఇప్పుడు మధ్యలో వేరుశెనగపప్పు కొబ్బరి పేస్టు (వేరుశెనగపప్పు కొబ్బరి పేస్టు తయారీ విధానము కోసం కింద చూడండి ) ని కూర్చుకొని పక్కన పెట్టుకోవాలి. Step 3 ఇప్పుడు చింతపండు ని వేడి నీళ్ళల్లో ఐదు నిముషాల పాటు నాన పెట్టాలి. తరువాత చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి. Step 4 ఇప్పుడు ఒక బాండలి లో తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి.అందులో తరిగిన ఉల్లిపాయలు వేసి వేగించుకోవాలి , ఉల్లిపాయలు కొంచం వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి. Step 5 అందులో తరిగిన టమోటా ముక్కలను కూడా వేసి ఉడికేంత వరకు వేయించాలి. Step 6 ఇప్పుడు చేసుకొన్న చింతపండు రసం ని కూడా వేసుకోవాలి. Step 7 అందులో తగినంత ఉప్పు, కారం పసుపు వేసి కలిపి 2 నిముషాల తరువాత వేరుశెనగపప్పు కొబ్బరి పేస్టు ని కూర్చుకొని వంకాయలను కూడా వేసుకోవాలి , Step 8 దీనిని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. అంతే గుత్తి వంకాయ కూర తయారు
Yummy Food Recipes
Add