Chicken Gongura Recipe By , 2017-02-14 Chicken Gongura Recipe Here is the process for Chicken Gongura making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చికెన్ - 1/2 kg,గోంగూర - 2 cups,అల్లం వెల్లుల్లి - 2 tsp,ఉల్లిపాయలు - 3,కొత్తిమిర - 1/2 cup,చుక్కకూర - 1/2 cup,ఉప్పు - తగినంత,కారం - 2 tsp,పసుపు - చిటికెడు,పచ్చిమిర్చి - 3,గరం మసాలా - 1 tsp,నూనె - 100 gm, Instructions: Step 1 చికెన్ శుభ్రంగా కడిగి, ఉప్పు, కారం , పసుపు వేసి కలిపి ఉంచాలి. గోంగూర, చుక్కకూర శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి. Step 2 గోంగూరలో చుక్కకూర కలపడం వల్ల రుచి పెరుగుతుంది. జిగురుగా లేకుండా బాగుంటుంది. Step 3 కొద్దిగా నీళ్ళు పోసి, మెత్తగా ఉడికించి చల్లారాక మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. Step 4 మందపాటి బాణలిలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించాలి. Step 5 అందులో అల్లం వెల్లుల్లి ముద్ద , పసుపు, కారం వేసి కొద్దిగా వేపాలి. తర్వాత చికెన్ ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగ కలియబెట్టి మరి కొద్ది సేపు వేయించాలి. Step 6 రెండు గ్లాసుల నీళ్ళు పోసి పది నిమిషాలు ఉడికిన తర్వాత గోంగూర ముద్ద వేసి కలిపి మరో పది నిమిషాలు ఉడికించి కొత్తిమిర, గరం మసాలా వేసి కలిపి దింపేయాలి.బిర్యానీలోకి, అన్నంలోకి, రొట్టెలలోకి కూడా ఈ కూర బాగుంటుంది.  
Yummy Food Recipes
Add