Sajja Pindi Dosa Recipe By , 2017-02-04 Sajja Pindi Dosa Recipe Here is the process for Sajja Pindi Dosa Recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: సజ్జలు ( Pearl Millet ) : ఒక కప్పు,మినపప్పు : అరకప్పు,మెంతులు : ఒక స్పూన్,సాల్ట్ : తగినంత,ఆయిల్ : సరిపడంత, Instructions: Step 1 ఒక గిన్నె తీసుకుని అందులో మినపప్పు , మెంతులు తగినంత నీరు వేసుకుని నాలుగు గంటలు నాననివ్వాలి, మరో గిన్నె తీసుకుని అందులో సజ్జలు నీరు వేసుకుని నాలుగు గంటలు నాననివ్వాలి. Step 2 ఇవి నానాక మిక్స్ జార్ తీసుకుని అందులో మినపప్పు , మెంతులు , వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి , దీన్ని ఒక గిన్నె లోకి తీసుకుని అందులో నానిన సజ్జలు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి దీన్ని కూడా మినపిండి లోవేసుకుని బాగా కలుపుకుని మూతపెట్టి రాత్రంతా నాననివ్వాలి . Step 3 ఉదయానికి పిండి బాగా పులుస్తుంది, ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. Step 4 ఇప్పుడు స్టవ్ వెలిగించి దోస పెనం పెట్టుకుని వేడిఎక్కక దానిపైన దోస లాగా పోసుకుని ఆయిల్ వేసుకుని రెండువైపులా కాల్చుకుని తీసుకోవాలి .అంతే సజ్జ దోస రెడీ …
Yummy Food Recipes
Add