Tamaraginjala payasam recipe By , 2017-01-23 Tamaraginjala payasam recipe Here is the process for Tamaraginjala payasam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 55min Ingredients: తామర గింజలు - ఒక కప్పు, పాలు - అరలీటరు, నెయ్యి - ఒక టీస్పూన్‌, పంచదార - నాలుగు టేబుల్‌ స్పూన్లు, బాదం, జీడిపప్పుల పలుకులు - ఒక్కోటి టేబుల్‌ స్పూన్‌ చొప్పున, ఎండుద్రాక్షలు - 12, సార పప్పు - ఒక టీస్పూన్‌ (ఇష్టమైతేనే), యాలకల పొడి - అర టీస్పూన్‌, కుంకుమపువ్వు - చిటికెడు., Instructions: Step 1 అరకప్పు తామర గింజల్ని సగానికి కోయాలి లేదా గ్రైండ్‌ చేయాలి. మిగతా సగాన్ని గింజలుగానే ఉంచాలి. పాన్‌లో నెయ్యి వేడిచేసి బాదం, జీడిపప్పుల్ని వేగించాలి. -తరువాత అందులోనే ఎండుద్రాక్షలు వేసి అవి ఉబ్బే వరకు వేగించి పక్కన పెట్టాలి. అదే పాన్‌లో తామర గింజల్ని వేసి లేత గోధుమరంగుకి వచ్చి కరకరలాడుతున్నట్టు వచ్చే వరకు గరిటెతో కలుపుతూ వేగించాలి. తరువాత వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. Step 2 మరో పాన్‌లో పాలు పోసి వేడిచేయాలి. వేడెక్కాక స్టవ్‌ మంటను తగ్గించి పాల మోతాదు తగ్గేవరకు ఉంచాలి. ఆ తరువాత వేగించిన తామర గింజలు వేసి సన్నటి మంట మీద ఐదు నిమిషాలు ఉంచాలి. Step 3 మధ్యమధ్యలో గరిటెతో కలుపుతుండాలి. పాయసం చిక్కబడుతుండగా పంచదార వేసి ఓ నిమిషం ఉడికించాలి. అందులో యాలకలపొడి, కుంకుమపువ్వు, వేగించిన బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షల్లో సగాన్ని వేసి బాగా కలిపి మంట తగ్గించాలి. Step 4 మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. వేడిగా లేదా చల్లగా ఎలా తిన్నా రుచిగానే ఉంటుంది. కాకపోతే తినేముందు పైన బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షలతో అలంకరించాలి. Step 5 పాయసం చిక్కగా కావాలనుకుంటే మూడు టేబుల్‌ స్పూన్ల కండెన్స్‌డ్‌ మిల్క్‌ కలుపుకోవచ్చు. తీపి ఎక్కువ కావాలనుకుంటే మరికొంచెం పంచదార కలుపుకోవచ్చు.
Yummy Food Recipes
Add