special simple eggless cake By , 2016-12-03 special simple eggless cake christmas special simple eggless cake recipe. Prep Time: 20min Cook time: 1hour 30min Ingredients: మైదా: ఒక కప్పు,  ,కండెన్స్డ్ మిల్క్: 1/2కప్పు,,పంచదార పౌడర్: పావు కప్పు,,జీడిపప్పు: 1 టేబుల్ స్పూన్,,ద్రాక్ష: 1 టీస్పూన్,,బేకింగ్ సోడా: పావు స్పూన్,,బేకింగ్ పౌడర్: హాఫ్ స్పూన్,,బట్టర్: 1/4 కప్పు,,పాలు: 1/2 కప్పు,,ఉప్పు: చిటికెడు గ్రీస్ కోసం :,బట్టర్ : 1 టీస్పూన్,,మైదా : 1స్పూన్, Instructions: Step 1 ముందుగా మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా మూడింటిని బాగా మిక్స్ చేసి జల్లు పట్టించి పక్కన పెట్టుకోవాలి. Step 2 తర్వాత ఇందులో పంచదార పొడి మరియు బట్టర్ రెండూ వేసి బాగా మిక్స్ చేయాలి. బట్టర్ స్మూత్ గా అయ్యే వరకూ మిక్స్ చేయాలి. Step 3 ఇప్పుడు అందులోనే కండెన్డ్ మిల్క్ వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలగలుపుకోవాలి. Step 4 సగం పాలు కూడా పోసి మొత్తం మిశ్రమం స్మూత్ గా అయ్యే వరకూ మిక్స్ చేసుకోవాలి. Step 5 ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ తీసుకొని అందులో అడుగున ఒక కప్పు ఉప్పు వేసి మంటను మీడియంగా పెట్టి, ఉప్పును వేడెక్కనివ్వాలి. Step 6 కండెన్స్డ్ మిల్క్ మైదా మిక్స్ ను క్లాక్ వైజ్ డైరెక్షన్ లో బాగా గిలకొట్టాలి. పిండి మొత్తం స్మూత్ గా అయ్యే వరకూ ఉండలు కట్టకుండా మిక్స్ చేయాలి. మరికొద్దిగా పాలు పోసి స్మూత్ గా కలుపుకోవాలి. Step 7 ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ బటర్ ను బేకింగ్ బౌల్ కు రాసి, దాని మీద ఒక టేబుల్ స్పూన్ మైదాను చిలకరించి తర్వాత లోపలి బౌల్ లోపలిబాగాన్ని కవర్ చేయాలి. Step 8 ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలో జీడిపప్పు మరియు ద్రాక్ష వేసి మొత్తం మిశ్రమాన్ని మరోసారి మిక్స్ చేసి బేకింగ్ బౌల్లో మిక్స్ చేయాలి. Step 9 ఇప్పుడు ఈ బేకింగ్ బౌల్ ను కుక్కర్ లో పెట్టి మూత పెట్టాలి. విజిల్ పెట్టకూడదు. Step 10 తక్కువ మంట మీద 30-40నిముషాలు ఉడికించుకోవాలి. 40నిముషాల తర్వాత మూత తీసి బేకింగ్ బౌల్లో కేక్ మొత్తం, అన్ని వైపులా బ్రౌన్ కలర్ లోకి మారిందో లేదో సరిచూసుకోవాలి. Step 11 తర్వాత చాకును కేకు లోపలికి చొప్పించి చూడాలి. పైకి తీసినప్పుడు , సులువగా చాకు బయటకు వస్తే అది తప్పనిసరిగా కేక్ తయారైనట్లే. అలా కాకుంటే మరో 10నిముషాలు తక్కువ మంట మీద తిరిగి బేక్ చేసుకోవాలి. Step 12 కేక్ రెడీ అయిన తర్వాత బేకింగ్ బౌల్ ను బయటకు తీసి, స్టౌ ఆఫ్ చేసి, చల్లారనివ్వాలి. Step 13 చల్లారిన తర్వాత బేకింగ్ బౌల్ ను ఒక సర్వింగ్ ప్లేట్ మీద బోర్లించి కేక్ ను నిధానంగా రిమూవ్ చేయాలి. కేక్ మొత్తం బటకు తీసుకొన్న తర్వాత మీకు నచ్చిన షేప్ లో కట్ చేసి సర్వ్ చేయాలి. Step 14 అంతే క్రిస్మస్ స్పెషల్ ఎగ్ లెస్ కేక్ రెడీ...
Yummy Food Recipes
Add