Kakarkaya pulusu recipe By , 2016-11-30 Kakarkaya pulusu recipe Here is the making process for Kakarkaya pulusu. Just follow the simple tips and cook mouth watering Kakarkaya pulusu. Prep Time: 25min Cook time: 20min Ingredients: కాకరకాయలు - అర కేజీ,చింతపండు రసం - ఒక కప్పు,సెనగపప్పు - ఒక టేబుల్ స్పూన్,మినపపప్పు - అర టేబుల్ స్పూన్,ఆవాలు - అర టీ స్పూన్,జీలకర్ర - ఒక టీ స్పూన్,మెంతులు - 4 గింజలు,ఎండుమిరపకాయలు - 6,పసుపు - పావు టీ స్పూన్,ఇంగువ - అర టీ స్పూన్,ఉప్పు - ఒకటిన్నర టీ స్పూన్స్,బియ్యపు పిండి - ఒక టేబుల్ స్పూన్,కరివేపాకు - రెండు రెమ్మలు,బెల్లం - రెండు అంగుళాల ముక్క, Instructions: Step 1 ముందుగ కాకరకాయలను బాగా కడిగి సన్నని చక్రాలుగా తరిగి పెట్టుకోవాలి . Step 2 తరవాత చింతపండు లో నీళ్ళు పోసి రసం తీసి పెట్టుకోవాలి . Step 3 ఇప్పుడు ఒక బాండి తీసుకుని అందులో నూనె వేసి సెనగపప్పు ,మినపపప్పు ,ఆవాలు ,జీలకర్ర , మెంతులు, ఇంగువ ,పసుపు, ఎండుమిరప ముక్కలు వేసి పోపు దోరగా వేయించాలి . Step 4 వేగిన పోపులో ఉప్పు,కరివేపాకు,కాకరకాయ ముక్కలు వేసి బాగా కలిపి కూర ముక్కలు ములిగె లాగా నీళ్ళు పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి. Step 5 తరవాత కూరలో కొద్దిగా నిరున్నప్పుదు బెల్లం , చింతపండు రసం పోసి దగ్గర పడే వరకు గరిటతో కలుపుతూ మాడకుండా చూడాలి . Step 6 ఇప్పుడు చిక్కగా అవుతున్న కూరలో బియ్యపుపిండి వేసి బాగా కలిపి ఒక ఐదు నిముషాలు ఉంచి దించేయాలి . అంతే ఘుమఘుమ లాడే కాకరకాయ పులుసు కూర రెడీ ....... తీపి అంటే ఇష్టం లేని వారు బెల్లం వేయకుండా కూడా చెసుకొవచ్చు. కాకరకాయ లో చెడు విరగాతనికి ఉప్పు ఇలా ముందుగానే పోపులో వేసేయ్యాలి .
Yummy Food Recipes
Add