Spicy Vegetable Lollipop By , 2016-11-28 Spicy Vegetable Lollipop Vegetable Lollipop recipe. Prep Time: 15min Cook time: 30min Ingredients: ఉడికించిన బంగాళదుంపల ముద్ద ఒక కప్పు,,తురిమిన చిన్న క్యారెట్ ఒకటి,,బీన్స్‌ 100 గ్రా.,,కేప్సికమ్‌ ఒకటి,,చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి,,సన్నగా తరిగిన అల్లం ముక్కలు,,పచ్చిమిర్చి ఒక్కో టీ స్పూన్‌,,క్యారెట్‌ స్టిక్స్‌ (కేరెట్‌ను నిలువుగా చీల్చి స్టిక్స్‌లాగా ) 8 లేక 10,,మైదా అర కప్పు,,సోయా సాస్‌ ఒక టీ స్పూన్‌,,చిల్లీ సాస్‌ ఒక టేబుల్‌ స్పూన్‌,,బ్రెడ్‌ పొడి అర కప్పు,,కోడిగుడ్డు ఒకటి,,నూనె వేగించడానికి తగినంత,,ఉప్పు, మిరియాల పొడి తగినంత., Instructions: Step 1 కూరగాయలను సన్నగా తరగాలి. ఒక టేబుల్‌ స్పూన్‌ నూనెను బాణలిలో వేసి వేడి చేయాలి. Step 2 అల్లం, ఉల్లిపాయ ముక్కలను వేసి వేగించాలి. క్యారెట్‌ తురుము, బంగాళ దుంపల ముద్ద, తరిగిన బీన్స్‌, కేప్సికమ్‌ వేయాలి. Step 3 ఓ రెండు నిమిషాలు ఆగి పచ్చిమిర్చి, ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్‌, చిల్లీ సాస్‌ వేసి బాగా కలపాలి. వీటన్నిటినీ 5 నిమిషాల పాటు ఉడికించాలి. Step 4 తర్వాత కిందికి దించి చల్లారనిచ్చి, ఆపై గుడ్డు వేసి బాగా కలపాలి. Step 5 ఈ మిశ్రమాన్ని లాలిపాప్స్‌ తీరులో తయారు చేయాలి. ఈ లాలిపాప్స్‌లో కేరెట్‌ స్టిక్స్‌ను జాగ్రత్తగా గుచ్చాలి. Step 6 ఆపై వీటిని బ్రెడ్‌ పొడిలో దొర్లించి కాగిన నూనెలో బాగా వేగించాలి. వీటిని సెజువాన్‌ సాస్‌తో గాని, టొమాటో కెచప్‌తో గాని తింటే చాలా బావుంటాయి.
Yummy Food Recipes
Add