Mahi Khalia Recipes By , 2016-11-26 Mahi Khalia Recipes Here is the process for Mahi Khalia. Just follow this simple steps and make delicious Mahi Khalia. Prep Time: 25min Cook time: 35min Ingredients: చేపముక్కలు – పావుకేజీ,నువ్వులు – టేబుల్‌స్పూను,జీడిపప్పు – పదిహేను,అల్లంవెల్లుల్లి ముద్ద – టేబుల్‌స్పూను,కొబ్బరిపొడి – రెండు టేబుల్‌స్పూన్లు,ఉల్లిపాయలు – రెండు, పచ్చిమిర్చి – ఐదు,చింతపండు రసం – టేబుల్‌స్పూను,జీలకర్ర – రెండు చెంచాలు,కరివేపాకు రెబ్బలు – రెండు,ఆవాలు – చెంచా,నూనె – పావుకప్పు,గసగసాలు – చెంచా,పసుపు – పావుచెంచా,ఉప్పు – తగినంత, Instructions: Step 1 గసగసాలూ, నువ్వులూ, జీడిపప్పూ, కొబ్బరి పొడి మిక్సీ జారులోకి తీసుకుని మెత్తని ముద్దలా చేసుకుని పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేడిచేసి జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలూ, ఆవాలు వేయించాలి. Step 3 అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. అవి ఎరుపురంగులోకి వచ్చాక అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపూ, తగినంత ఉప్పూ, చింతపండు రసం వేయాలి. Step 4 చింతపండు రసం ఉడికి, నూనె పైకి తేలాక చేపముక్కలూ, కాసిని నీళ్లు పోసి మంట తగ్గించేయాలి. Step 5 చేపముక్కలు పూర్తిగా ఉడికాక ముందుగా చేసుకున్న మసాలా వేసి.. బాగా కలపాలి. ఇది గ్రేవీలా తయారయ్యాక దింపేయాలి.
Yummy Food Recipes
Add