Diwali special Dry Fruit Burfy Recipe By , 2016-10-28 Diwali special Dry Fruit Burfy Recipe Diwali special Recipe Dry Fruit Burfy. Prep Time: 10min Cook time: 55min Ingredients: ఒకటిన్నర కప్పు  అంజీర్ పండ్లు ,ఒక కప్పు ఖర్జూరం,1/3 కప్పు బాదం పప్పు   ,1/3 కప్పు జీడిపప్పు,1/3 కప్పు అక్రోట్స్,1/3 కప్పు పిస్తా,1/3 కప్పు ఎండుద్రాక్ష,1 టేబుల్‌స్పూన్ గుల్కాండ్  ,అర టీస్పూన్ యాలకుల పొడి ,1/4 టీస్పూన్ జాజికాయ పొడి,1 టేబుల్ స్పూన్ నెయ్యి లేదా నూనె   ,వెండి పొర ఆకు (డెకరేషన్ కోసం), Instructions: Step 1 ముందుగా అంజీర్‌ని గోరు వెచ్చని నీటిలో 15 నిమిషాలు నానబెట్టాలి. తరువాత నీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. Step 2 అనంతరం బాదపప్పు, జీడిపప్పు, ఎండుద్రాక్ష, అక్రోట్స్, పిస్తా, ఖర్జూరంలను మిక్సీలో కొద్దిగా పట్టాలి. నీరు వేయకుండా అంజీర్‌ని మెత్తగా రుబ్బుకోవాలి. Step 3 నూనె లేదా నెయ్యిని వేడి చేసి అందులో అంజీర్ పేస్ట్‌ని కొద్దిగా వేయించుకోవాలి. అనంతరం ముందుగా ముక్కలు చేసుకున్న ఖర్జూర్‌ని వేసి 2 నిమిషాల పాటు ఉడికించాలి. Step 4 తరువాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. యాలకుల పొడి, జాజికాయ పొడి, గుల్కాండ్‌ని వేసి బాగా కలపాలి. తరువాత 1 నిమిషం పాటు దాన్ని ఉడికించాలి. Step 5 ఒక ప్లేట్‌లో బర్ఫీ మిశ్రమం వేసి గరిటెతో సమానం చేయాలి. అనంతరం ఉడికేదాక ఉడికించుకోవాలి. Step 5 చివరిగా సిల్వర్ ఫాయిల్‌లో బర్ఫీని వేసి 20 నుంచి 30 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. తరువాత మనకి నచ్చిన పరిమాణంలో ముక్కలుగా చేసుకోని ఇంటిల్లిపాది తీపితో పండగ చేసుకోవచ్చు. Step 5 బర్ఫీని గాలిచొరబడని కంటెయినర్లలో స్టోర్ చేసుకుంటే దాదాపు 2 వారాల వరకు నిల్వ పెట్టుకోవచ్చు.
Yummy Food Recipes
Add